జాషువా 120వ జయంతి వేడుకలు

కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా రచనలపై మరోసారి అధ్యయనం జరగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా ఆదివారం ఎసి కళాశాలలో 'జాషువా సమగ్ర రచనలు - సమాలోచన' అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సుల్లో సాహితీ వేత్తలు, అభ్యుదయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె యస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. సభలో దళిత తత్వవేత్త డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ.. జాషువా తెలుగు పద్యాన్ని ఆయుధంగా మలుచుకుని శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచనలతో కులవివక్ష, అస్పృశ్యతపై యుద్ధం చేశారని అన్నారు.