కనీసధర కూడా రాలేదు:కృష్ణన్‌

గిట్టుబాటు ధర లేక చెరకు రైతులు కూడా ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అఖిల భారత చెరకు రైతుల సమ న్వయ కమిటీ కన్వీనర్‌ విజ్జూ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయంతో పోల్చితే మద్దతు ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. చెరకు ఉత్పత్తి వ్యయం టన్ను రూ. 2,500 ఉన్నట్లు కేంద్రమే అంచనా వేసిందన్నారు. 
కాని ఆ మొత్తాన్ని చెల్లించేందుకైనా ఫ్యాక్టరీలు సుముఖత చూపించటంలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ చెరకు రైతుల సంఘం ప్రథమ మహాసభ విజయవాడలోని ఎంబి అధ్యయన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటైంది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా విజ్జూ కృష్ణన్‌ ప్రసంగిచారు. అధిగ దిగుబడి నిచ్చే చెరకు విత్తనాన్ని కనుగొనేందుకు పరిశోధనలు నిర్వహిం చటంలేదని, రైతులు ఆరుగాలం కష్టించినా చెప్పుకోదగ్గ దిగుబడి రావటం లేదని ఆయన తెలిపారు.