ఎక్కడి సమస్యలు అక్కడే.!

 రాజధాని శంకుస్థాపన సంబరాల మధ్య ప్రజా సమస్యలు పక్క కెళ్లిపోతున్నాయి. మంత్రులు, అధి కార యంత్రాంగమంతా కేవలం రాజధాని శంకు స్థాపన మీదే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాధాన్య అరశాలపైనా ఎవరూ స్పరదిరచడం లేదు. వివిధ జిల్లాల్లో రోజూ సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు.దాదాపు అన్ని శాఖల్లోనూ ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. చివరకు ముఖ్యమంత్రి పేషీలో సైతం దాదాపు 18 వేలకుపైగా ఫైళ్లు కదలకుండా ఉన్నట్లు అధికారులే అరగీకరిస్తున్నారు.రాష్ట్రంలోని అనేక ప్రారతాల్లో డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, వైరల్‌ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నా, ప్రభుత్వపరంగా వైద్య సేవలు ఎప్పటిలా అధ్వానంగానే ఉన్నాయి. ఆసుపత్రుల్లోనే కుక్కలు, ఎలుకలు, పందికొక్కుల సంచారంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. నిర్లక్ష్యం వల్ల, సరైన వైద్యం అరదక ప్రజలు మృత్యువాత పడుతు న్నా అప్పటికప్పుడు స్పందించి, విచారణకు కమిటీలు వంటివి ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పుడైతే ఇక అధికారులు, మంత్రులు పూర్తిగా రాజధాని సంబరాల మీదే ఉన్నారు.