అర్భన్‌హెల్త్‌ సెంటర్స్‌ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి

జిల్లాలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగుల ఆరు నెల్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ కోరారు. సోమవారం ఎపి అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ జీతాల్లేక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిలల్ల స్కూల్‌ ఫీజులు కట్టలేక, కుటుంబాలు గడవక ఉద్యోగులు అప్పుులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ రాష్ట్ర అధికారులకు ఇప్పటికే బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించామని, వాటిని త్వరగా తెప్పించి వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్‌.బసవదేవి, రమణ, నాయకులు సులోచన, పద్మావతి, చంద్రావతి, పాల్గొన్నారు.