అక్రమ రెగ్యులరైజేషన్‌పై రైతుల్లో ఆగ్రహం..

కృష్ణా కరకట్ట దిగువ భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాటవుతుం డటమే ఇందుకు కారణం.రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన 29 గ్రా మాలకు సమీపంలో పలువురు రైతులు షెడ్లు, కోళ్ల ఫారాలు, నివాస గృహాలు నిర్మించుకున్నారు. వాటన్నిటినీ పూలింగు కింద ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. నిర్మా ణాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పదేపదే మంత్రి నారాయణ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. క్రిడా కమిషనర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ నిర్మాణాలు, ఇళ్లనూ పూలింగు ప్రక్రియకు ఇచ్చేశారు. ఈ ప్రక్రియంతా పూర్తయ్యాక, కరకట్ట దిగువభాగంలో ఉన్న నిర్మాణాన్ని రెగ్యు లరైజ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబులాంటి నేత లకు సరైన పద్ధతి కాదనే స్థాయికి రైతులెళ్లారు. ముఖ్యమంత్రి నివాసానికి ఏ పద్ధతిలో రెగ్యులరైజేషన్‌ వచ్చిందో అదే పద్ధతిలో తమ భవనాలకూ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళ నకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.