చిత్తూరులో దళిత హక్కుల సదస్సు

చిత్తూరు జిల్లాలో దళితులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. వివక్ష రూపుమాపేందుకు అధికారయంత్రాంగం చొరవతీసుకోవాలి. లేకుంటే పోరాటం తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. తనకు కులంపైన నమ్మకం లేదని సిఎం చెబుతున్నారు...మరి సొంత జిల్లాలో కుల వివక్షపై మీ స్పందన ఏమిటని ప్రశ్నస్తున్నాను. కుల వివక్ష ముఖ్యమంత్రికే సిగ్గుచేటు. టిటిడికి ఒకరినయినా ఈవోగా నియమించారా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే టిటిడి ఈవో గా దళితులను నియమించసలి. గతంలో దళితగోవిందం పూజలుచేసిన శ్రీవారి విగ్రహాలను గోదాముల్లో పడేశారు. ఇది వివక్ష కాదా. కబ్జా అయిన దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలి. దళితులను ఆలయాల్లోకి అనుమతించకుంటే మేమే ఉత్సవాలు నిర్వహించి దళితులను ఆలయాల్లోకి తీసుకెళతాం. బెల్టుషాపులను అరికడతానని చెబుతున్న సిఎం కుల వివక్ష రూపుమాపుతానని ఎందుకు చెప్పరు...ఇంత జరుగుతున్నాదళిత మంత్రులు ఎంచేస్తున్నారు...వివక్షపై మాట్లాడరా అని ప్రశ్నించారు.