District News

విజయనగరం జిల్లా సాలూరు లోని గిరిజన ప్రాంతాలలో శిఖపరువు,తామరకొండ, పోలిమెట్ట,దుక్కడమెట్టల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తామరకోండ,పోలిమెట్ట,దుక్కడమెట్ట శిఖపరువు కొండలను త్రవ్వకాలు చేయవదంటూ సిపిఎం నాయకత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలోని  పనులు అడ్డుకోవడం కోసం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ కృష్ణమూర్తి ప్రజలతో  కలిసి ర్యాలీగా బయలుదేరారు.. 

ముఖ్యమంత్రి పర్యటనలకొచ్చినప్పుడల్లా సిపిఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రభుత్వ రివాజుగా మారింది. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అరెస్టుల పర్వం కొనసా గింది.సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తిసహా పలువురు సిపిఎం నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయనను ఉన్న పళంగా అరెస్టు చేశారు. ఈ అక్రమాన్ని కుటుంబ సభ్యులు నిలదీసినా పోలీసులు ఆయనను విడిచి పెట్టలేదు. బలవంతంగా జీపు ఎక్కించి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు...

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మూడు జ్యూట్‌ మిల్లులకు సోమవారం ఆయా యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటిం చాయి. వీటిలో కొత్తవలస మండలం సీతంపేట వద్దగల ఓల్డు ఉమా ట్వైన్‌, చింతలదిమ్మ సమీపంలోని న్యూ ఉమా జ్యూట్‌ ప్రొడక్ట్సు, అదే ప్రాంగణంలోని సాయి జ్యూట్‌ ప్రొడక్ట్సు మిల్లులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ మూడు మిల్లులూ ఒకే కుటుంబానికి చెందిన వారివి. 

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే.. ఈ ప్రాంతంలోని మంత్రి అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు....

సాలూరు మండలంలో గ్రానైట్‌ తవ్వకాలకు లీజు అనుమతులు ఇవ్వొద్దని తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండు చేశారు. గురువారం ఆ కమిటీ కన్వీనర్‌, గిరిజన సంఘం, నాయకులు ఎం.శ్రీనివాసరావు అధ్వర్యాన రామస్వామిడ వలస, వల్లాపురం, సీతందొరవలస గ్రామాలకు చెందిన గిరిజనులు తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రిలే నిరహార దీక్షలు ప్రారంభిం చారు. దీక్షలనుద్దేశించి భూ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ గేదెల సత్యనారాయణ మాట్లాడారు. తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట ప్రాంతాల్లో గ్రానైట్‌ తవ్వకాల కోసం ప్రధానరాజకీయ పార్టీల అండతో కొంతమంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారన్నారు. ఇక్కడ గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులిస్తే చుట్టూ వున్న గిరిజన రైతులు...

                       అతి కీలకమైన రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని చూస్తోంది. అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రైవేటు రాగం తీస్తున్న చంద్రబాబు ఒక్కొక్క ప్రజా సేవపై వేటు వేస్తూ వస్తున్నారు. తాజాగా రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. బిడ్డింగుల పేరిట బహుళ జాతి సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించాలని చూస్తున్నారు. ముందుగా వాహన సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ చేసి, వాటి బాధ్యతను ఐదు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి కోట్ల రూపాయల భారాలను ప్రజలపై వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నూతన విధానం వల్ల రాష్ట్ర రవాణా శాఖలోని వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం...

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారని రైతులు అడ్డుపడటంతో...

విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వే (రైట్స్‌) (న్యూఢిల్లీ) బృందం చేపట్టిన సర్వేను బాధితులు అడ్డుకున్నారు. సర్వే రాళ్లను మహిళలు పీకేశారు. గురువారం పలు గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసిన రైట్స్‌ బృందం సభ్యులు శుక్రవారం కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాల్లో పలు చోట్ల రాళ్లు పాతారు. తూడెం గ్రామంలో జిరాయితీ భూముల్లో సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అడిగేందుకు వెళ్లిన వారిని పోలీసులు వెళ్లగొట్టారు. అనంతరం గ్రామ పెద్దలతో అందరూ కలిసి వెళ్లి సర్వే రాళ్లను భూముల నుంచి తొలగించారు. అక్కడి నుంచి బసవపాలెం మీదుగా...

Pages