District News

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించనున్న అణు పార్కుతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు తెలి పారు.  సైట్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణ యం చేయకుండా రైతుల నుంచి భూములు తీసుకునే అది ప్ర‌కారం ప్రభుత్వానికి లేదన్నారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో నిర్మించాల్సిన అణుపార్కును కొవ్వాడకు తరలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ నాలుగున ప్రకటించిందని, మోడీ-ఒబామా ఒప్పందం జూన్‌ ఏడున జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది చెప్పడం లేదని తెలిపారు. టిడిపి తక్షణమే తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం పైడిభీమ‌వ‌రం వ‌ద్ద గ‌ల  అర‌బిందో ఫార్మా ప‌రిశ్ర‌మలో ప‌నిచేస్తున్న వేలాది మంది  కార్మికులు సిఐటియు ఆద్వ‌ర్య‌ములో చేసిన   సాధించింది. నూత‌న వేత‌న ఒప్పందం జ‌రిగింది. అర‌బిందో కార్మికుల విజ‌యోత్స‌వ స‌భ‌లో  సిఐటియు రాష్ట్ర ఉసాధ్య‌క్షులు, అర‌బిందో ఫార్మా వ‌ర్కర్స్ యూనియ‌న్ గౌర‌వ అధ్య‌క్షులు సి.హెచ్.న‌ర్సింగ‌రావు మాట్లాడారు.ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ మ‌రింత ఐక్య‌త‌తో మందుకెళ్ళాల‌ని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధ్య‌మ‌వుతాయ‌ని అన్నారు .ఐక్య‌తే ఆయుధం.పోరాట‌మే మార్గం అని అన్నారు.కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నాయ‌ని అన్నారు.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన,వినాశ‌క‌ర‌మైన‌,ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాల‌ని సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్య‌తిరేకంగా సిపియం ప్ర‌జాసంఘాల ఆద్వ‌ర్య‌ములో  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్ర‌భావిత గ్రామాల‌లోప‌ర్య‌టించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు. అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత స‌హ‌జ‌మ‌ని అన్నారు.అణువిద్యుత్ యూనిట్ త‌యారికి 10 రూపాయిలు ఖ‌ర్చు అవుతుంద‌ని...

కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు

     కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టించాల‌ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు పిలుపునిచ్చారు. ర‌ణ‌స్థ‌లంలో దేవిశ్రీ క‌ళ్యాణ మండ‌పంలో కొవ్వాడ అణుపార్కుకు వ్య‌తిరేకంగా ప్ర‌జాసంఘాల ఆధ్వ‌ర్య‌ములో రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న ముఖ్య వ‌క్త‌గా మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు.అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత స‌హ‌జ‌మ‌ని అన్నారు.అణువిద్యుత్...

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాలకొండ ఆర్డీవో ప్రకటించారు. 
హిర...

       వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ 2005లో వంశధార ప్రాజెక్టును...

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి...

           ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులపై అలసత్వం వహించవద్దని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. గురువారం టెక్క‌లి మండలంలోని శ్యామసుందరాపురంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లు, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మహిళ కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ జన్మభూమి కమిటీలకు అప్పగించామని, వారినే అడగాలని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై రవీంద్రకుమార్‌, ఎంపిపి మట్ట సుందరమ్మ, సర్పంచ్‌ బెహరా కృష్ణవేణి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తోందని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గురువారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫార పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ చదువు కోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు భాధ్యతాయతంగా మెలిగి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తర్ర రామకృష్ణ, ఎంఇఒ నక్క రామకృష్ణ పాల్గొన్నారు.

         ఎన్నికల హామీలను నెర వేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి విమర్శించారు. గురువారం కంచిలి మండలంలోని గొల్లకంచిలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 71 వేలు ఫిర్యాదులొస్తే 90 మాత్రమే పరిష్కరించారని దుయ్యబట్టారు. ఉద్యోగాలిప్పి స్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైసిపి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, కృష్ణారావు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Pages