District News

వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది.  నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు 

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ...

శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సుకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాశ్ కరత్ హాజరయ్యారు .భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటానికి యత్నిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి పెట్టుబడి రూ.2లక్షల 80...

Pages