District News

మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర కార్మిక, రైతాంగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కర్నూల్లో జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా కార్మిక కర్షకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా పోలీసులు కార్మిక, రైతాంగ సంఘాల నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పండించిన పంటలకు 50 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలన్నీ ఎండిపోయాయని, పశ్చిమ ప్రాంతంలో పూర్తిగా...

జిల్లాలో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్‌ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు. 

రాష్ట్రంలో 65 రకాల ఉత్పత్తి రంగాల్లో 50 లక్షలకుపైగా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుని ఏడాదికి రూ.500 కోట్ల శ్రమను యజమానులు దోచుకుంటు న్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ తెలిపారు. సిఐటియు కర్నూలు జిల్లా 10వ మహాసభలో పాల్గొనేందుకు ఆదోనికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక శాఖ రెండేండ్ల పెరిగే ధరలకను గుణంగా వివిధ సెక్టార్లలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేత నాలు పెంచాలని కోరారు. 15 ఏళ్లుగా కార్మిక శాఖ వేతనాల పెంపుదల జోలికే వెళ్లలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్‌, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన రాయల సీమకు మరో మారు మొండిచెయ్యి చూపిందని విమర్శి ంచారు. మూడో...

రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో టిడిపి ప్రభుత్వమే భూకబ్జాదారుగా మారిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. భూసేకరణ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలం గని గ్రామాల్లో సోలార్‌ హబ్‌ కింద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలకు సంబంధించిన భూసేకరణలో ఎక్కడ భూసేకరణ జరిగినా 80 శాతం మంది నిర్వాసితులు గ్రామసభలో ఒప్పుకోవాలనే నిబంధన ఉందన్నారు. భూమిని తీసుకున్నాక పూర్తిస్థాయిలో వారికి పునరావాసం కల్పించాలని చట్టంలో ఉందన్నారు. మార్కెట్‌ విలువ ఆధారంగా నాలుగు...

కార్మికుల మెడలపై కత్తి వేసే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను తిప్పకొట్టడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల ఆవరణంలో నిర్వహించిన సిఐటియు రాష్ట్ర స్థాయి క్లస్టర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. గత కార్మిక చట్టాల్లో ఎనిమిది గంటల పని దినాలు ఉన్నా, వాటిని ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం బిజెపి సవరించి తీరుతామని చెప్పడం విడ్డూరమన్నారు.

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక...

Pages