District News

పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్‌ల వద్ద అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బయలుదేరి వెళ్లారు.

గోదావరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు.పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ జరుగుతున్న పుష్కరాల్లో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ఘాట్ కు చేరుకున్నారు. దీనితో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసు యంత్రాంగం చేతులెత్తేశారు. భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. పది లక్షల జనాలు వస్తారని అంచనా వేసినా కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకూ రాజమండ్రిలోని అన్ని పుష్కర ఘాట్లను ఆకాశమార్గాన హెలికాప్టర్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాల పిండివంటలతో ‘మెగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ’ నిర్వహిస్తున్నారు. తిరుపతిసహా రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల నమూనాలను రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇవి భక్తులను అలరించనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, సినీ సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు భక్తులను అలరించనున్నారు. గోదావరి పుష్కరాల్లో ప్రజలు తాము పొందిన అనుభూతిని #MahaPushkaram2015 ట్విటర్‌ లేదా ఫేస్‌...

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. స్థానిక సెయింట్‌పాల్‌ చర్చి మైదానంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ చేపట్టిన దీక్షను రెండో రోజే పోలీసులు భగ్నం చేయడం.. ఆ సమయంలో హర్షకుమార్‌ తన వద్దనున్న తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం.. వంటి ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలో సీఎం పర్యటన కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి నగరంలో ముస్లింలకు షాదిఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హర్షకుమార్‌ శుక్రవారం దీక్ష ప్రారంభించారు. దీక్షకు పలువురు కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కానీ, శనివారం సాయంత్రం పోలీసులు దీక్ష జరుగుతున్న సెయింట్‌పాల్‌...

మున్సిపల్‌ కార్మికులతో మంత్రులు శనివారం రాత్రి పొద్దుపొయ్యేంతవరకు రాజమండ్రిలో జరిపిన చర్చలు విఫలమైనాయి. విధిలేని పరిస్థితుల్లో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జెఎసి ప్రకటించింది. పుష్కర విధులనూ బహిష్కరించాలని, పుష్కరాలు జరుపుతున్న ప్రాంతాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులతో కలిసి సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవిధక సమ్మె శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. పలు జిల్లాల్లో కార్మికులు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు. పిఆర్‌సి ప్రకారం రూ.15,432 కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు...

ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్‌ హోటల్‌ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన మాట తప్పారని..మోసగాడని ఘాటుగా విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక.. విస్తరింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. మహిళల అందోళనకు రాజకీయ పక్షాలు పూర్తి మద్దతిస్తున్నాయని చెప్పారు. ఇదే విషయంలో సాయంత్రం అఖిలపక్షం...

Pages