District News

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని...

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది. చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల...

రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫ్యలంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తగదని హిందు ధర్మ ప్రచారకులు కమలానందభారతి అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సముచితం కాదని,ప్రతిపక్షాన్ని, ఇతర ప్రజాసంఘానులను ఉద్ధేషించి ఆయన అన్నారు. పుష్కరాల్లో మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావించాలన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీటి విడుదలకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కమలానంద భారతి సూచించారు.

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసినా ప్రజలు రాజమండ్రికి పెద్ద ఎత్తున తరలి వస్తారని ప్రభుత్వానికి తెలుసు....

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు. ఆయన రాక కారణంగా రెండున్నర గంటల పాటు భక్తులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. జరిగిన దానికి బాబు కాశీకి వెళ్లి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఆయన అన్నారు.అన్నీ...

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు.కృష్ణా పుష్కరలప్పుడు జరిగిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడిగా తను చేసిన వ్యాక్యల్ని గుర్తుచేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.. 

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడిన కుటుంబాకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా క్షత గాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డగించే ప్రయత్నం చేశారు.అప్రమత్తమైన పోలీసులు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 26 మంది చనిపోవడం దురదృష్టకర సంఘటన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అని తెలిపారు. యాత్రికుల సంఖ్యను అంచాన వేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పుష్కర స్నానం పూర్తయిన అనంతరం అధికారులు చేతులెత్తేయండతో ఈ ప్రమాదం జరిగిందని రాఘవులు అభిప్రాయపడ్డారు.

Pages