District News

డిగ్రీ కళాశాలలో సెమిస్టర్‌ విధానాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు కలిగే నష్టాలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసింది.90 శాతం డిగ్రీ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇలాంటి స్థితిలో ఆరు నెలల కాలంలో నాలుగు ఇంటర్నల్స్‌, నాలుగు ప్రాక్టికల్స్‌, రెండు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. డిగ్రీలో ఉపాధి కోర్సులు ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులలను వెంటనే భర్తీ చేయాలని, సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా మహేశ్...

రెవెన్యూ శాఖ లోపం వల్లే తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రుని కోరంగి కంపెనీ భూ వివాదానికి కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీషు పాలన అనంతరం కోరంగి రైసుమిల్లు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇటీవల రైసుమిల్లును పడగొట్టి ఒకరు ఇటుక, ఇంకొకరు కలప తరలించుకు పోయానా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చూస్తూ ఊరుకుందన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్‌ శేషగిరిరావు ఆ భూములపై లోతుగా విచారించలేదన్నారు.

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఒక దళితుడి చేయి విరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, పేదలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారని మండిపడ్డారు. పోలీసులు భూస్వామికి కొమ్ము కాసి తప్పుడు...

విలీన మండలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆద్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది..కూన‌వ‌రం, వీఆర్ పురం, చింతూరు, ఎట‌పాక‌, కుకునూరు, వేలేరుపాడులో  సీపీఎం ఇచ్చిన పిలుపు అంద‌రినీ క‌దిలించ‌డంతో వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ముఖ్యంగా విలీనం జ‌రిగి ఏడాదిన్న‌ర గ‌డుస్తున్నా క‌నీస స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కాక ర‌గిలిపోతున్న జ‌నాల ఆగ్ర‌హం బంద్ రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు చింతూరులో బంద్ కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు..

 

 

సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు. కార్మిక చట్టాలు, పకడ్బంధీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్...

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్‌ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు. 
సమాజానికి ప్రతి ఒక్కరూ అక్షరంతోగానీ, బోధనతో గానీ సేవలందిం చాలన్నారు. కుల, మతతత్వాలు, నిరంకుశత్వాలను నేటి పాలకులు పెంచి పోష...

ప్రజా సమస్యలపై సిపిఎం ప్రచారాందోళనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు పాఠశాలలనూ, పిహెచ్‌సిలనూ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

Pages