District News

ఎ.పి కి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అమ‌లాపురంలోని గ‌డియార స్ధంబం సెంట‌ర్‌లో వామ‌ప‌క్షాల ఆధ్వర్యంలో  ప్ర‌జాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .

ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజీపేటలో దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనేకేళ్లుగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే ప్రభుత్వ వాటికి హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు....

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రజల తాగు, సాగు, పారిశ్రామిక...

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

రాజకీయ ప్రయోజనం కోసమే వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముందస్తు పథకంతోనే తూర్పుగోదావరి జిల్లా తునిలో భయానక వాతావరణాన్ని సృష్టించారని సిఎం చంద్రబాబు విమర్శించారు. అనుకోకుండా జరిగిన ఘటన మాత్రం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తునిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలు ఆలోచించి, చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో కాపులకు ఎంతమాత్రం సంబంధం లేదని, కొన్ని విద్రోహశక్తులే ఇందుకు కారణమని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

Pages