District News

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

రాజకీయ ప్రయోజనం కోసమే వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముందస్తు పథకంతోనే తూర్పుగోదావరి జిల్లా తునిలో భయానక వాతావరణాన్ని సృష్టించారని సిఎం చంద్రబాబు విమర్శించారు. అనుకోకుండా జరిగిన ఘటన మాత్రం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తునిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలు ఆలోచించి, చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో కాపులకు ఎంతమాత్రం సంబంధం లేదని, కొన్ని విద్రోహశక్తులే ఇందుకు కారణమని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్‌బెస్ట్‌ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ఆల్‌బెస్ట్‌ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది. రెండున్నరేళ్లు పైబడిన సీనియర్‌ కార్మికులకు మూడు నెలల జీతాన్ని నష్టపరిహారంగా చెల్లించడానికి, మిగిలిన వారికి రెండున్నర నెలల జీతం చెల్లించడ...

దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ భవన్‌లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్‌ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.

రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 

భూసేకరణ పేరుతో బలవంతంగా రైతులనుంచి భూమి సేకరించడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా వ్యతిరేకించారు.సిపిఎం రాష్ట్ర ప్లీనం సందర్బంగా రాజమండ్రిలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు .. అభివృద్ధి ముసుగులో భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, సోలార్‌ పార్కుల పేరుతో ఏపీ సర్కారు భూమిని లాక్కుంటోందని ఆరోపించారు..

నవసమాజ నిర్మాణం కోసం జరిగే సామాజిక ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమై న నివాళి అని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. రాజమం డ్రిలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ సామాజిక న్యాయం కోసం పోరాడారని, కానీ నేటి పాలకులు సమాజం లో అంతరాలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దళి తులంతా సామాజిక పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దళితులు చదువుకోవ డం ద్వారా కొంత ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నారని తెలిపారు. పాలకులు ఆ విద్యను కూడా వారికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్ర‌భుత్వానికి జ‌ల‌వ‌న‌రుల వినియోగంలో చిత్త‌శుద్దిలేద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు బీవీ రాఘ‌వులు విమ‌ర్శించారు. రాజ‌మండ్రిలో జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న గ‌తంలో జ‌ల‌య‌జ్ఞం పేరుతో వైఎస్ హాయంలో జ‌రిగిన త‌ప్పిదాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అదే బాట‌లో సాగుతున్నాయ‌ని ఆరోపించారు.ప్ర‌జ‌ల మీద చిత్త‌శుద్ధి ఉండి, పోల‌వ‌రం పూర్తిచేయాల‌నుకుంటే తొలుత రీ డిజైన్ చేయాల‌న్నారు. ఉన్న కొద్దిపాటి నిధుల‌ను వినియోగించి 120 అడుగుల మేర ప్రాజెక్ట్ పూర్తిచేయాల‌న్నారు. అప్పుడు నీటి వినియోగంలో ల‌క్ష్యాలు నెర‌వేరుతాయ‌న్నారు. నిర్వాసితుల స‌మ‌స్య కూడా రాద‌న్నారు. అందుకు భిన్నంగా నిధులు లేని స‌మ‌యంలో 152 అడుగుల పేరుతో కాల‌యాప‌న చ...

Pages