2017

మహోన్నతుల కోవలో సింహాద్రి శివారెడ్డి

పీడిత వర్గాల తరపున పోరాడే క్రమంలో ఆదర్శనీయ జీవితం గడిపిన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి మహోన్నతుల కోవలోకి సింహాద్రి శివారెడ్డి త్యాగమయ జీవితం చేరుతుందని, పేదల గుండెల్లో ఆయన కలకాలం నిలిచిపోతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. శనివారం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని శివారెడ్డి నివాసం వద్ద మంగళగిరి డివిజన్‌ కార్యదర్శి జె.వి.రాఘవులు అధ్యక్షతన శివారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తనతోపాటు కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కూడా పీడిత వర్గాల కోసం పని చేసే విధంగా తీర్చిదిద్దటం అత్యంత గొప్ప విషయమన్నారు.

దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరిన వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ

మిర్చికి రూ.12 వేల ధర ప్రకటించాలి

క్వింటా మిర్చి కి రూ.12 వేలు, క్వింటా కందికి రూ.7,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. బుధవారం క్రోసూరులోని ఆమంచి భవనంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆవుల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. జరిగింది. పాశం రామారావు మాట్లాడుతూ మిర్చి ఒక ఎకరం పండించడానికి 1.25 లక్షలు ఖర్చవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి పరోక్షంగా రూ.40 వేలు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.12 వేలు ఉన్న మిర్చి క్వింటా ప్రస్తుతం రూ.ఏడు వేలకు పడిపోయింది.

Pages

Subscribe to RSS - 2017