2017

పేదల ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కై ఆందోళన

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు.

రైతాంగ సమస్యలను పరిష్కరించాలి

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Pages

Subscribe to RSS - 2017