2017

శివారెడ్డి స్పూర్తితో ప్రజా ఉద్యమాలు

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.

శివారెడ్డి జీవితం ఆదర్శనీయం

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు.

విఠంరాజుపల్లి అగ్నిప్రమాదంలో సర్వకోల్పోయినబాధితులకు సిపిఎం సాయం

ప్రమాదాలు జరిగిన వెంటనే మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఎస్సీకాలనీలో గత నెల 20వ తేదీన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు, పొగాకు కొస్టాలు దగ్ధమై తీవ్ర నష్టంవాటిల్లి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. విజయవాడ పాపులర్‌ షూమార్ట్‌ వారి సహకారంతో దుప్పట్లు, టవళ్లు, ఇనుప మంచాలు సోమవారం విఠంరాజుపల్లి బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు శివారెడ్డి

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన మహా యోధుడు సింహాద్రి శివారెడ్డిని ఆయన ఆశయబాటలో నేటి యువతరం పనిచేయాలని సిపిఎం జిల్లాకార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మారక భవన్‌లో నిర్వహించిన శివారెడ్డి సమస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. 1928లో ఖాజా గ్రామంలో ధనిక కుటుంభంలో పుట్టిన శివారెడ్డి ఆ ప్రాంతం రైతాంగ సమస్యల కోసం 1944లో గ్రామంలో రైతుసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత 1946లో పార్టీ శాఖ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోను, మంగళగిరి ప్రాంతంలోను జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు.

అగ్ని ప్రమాద బాధితులకు సిపిఎం సాయం

మండలంలోని విఠంరాజుపల్లిలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలకు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వంటసామగ్రిని, దుస్తులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయటంతో పాటు ప్రమాదంలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు భోజనప్లేట్లు, చెంబులు, గ్లాసులు, టిఫిన్‌ బాక్స్‌లు అందించారు. ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస రడ్డి దుస్తులు, వంటసామాగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు.

Pages

Subscribe to RSS - 2017