పార్టీ కార్యక్రమాలు

Sat, 2015-06-06 11:35

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాపై దాడిచేసి పూలే, అంబేద్కర్‌ చిత్రపటాలను చెప్పులతో కొట్టడాన్ని దురహంకారానికి నిదర్శనంగా దళిత, బిసి సంఘాల నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి సిపిఎం రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ, జిల్లా నాయకులు సుంకరి సంపత్‌, బండారి శేఖర్‌ ఆధ్వర్యంలో జీపుజాతా చేస్తున్న క్రమంలో కొందరు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సిపిఎం, సహా దళిత, బిసి, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిరసనలు కొనసాగాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దళిత, బిసి సంఘాలు సహా పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు...

Pages