December

చంద్రబాబుపై కేసు పెడతాం:మధు

కాల్‌మనీ వ్యాపారులలో సిపిఎం నాయకుడున్నట్లు సిఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆధారాలతో నిరూపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండు చేశారు. నిరూపించలేకుంటే ఈనెల 25వ తేదీలోగా తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే సిఎం చంద్రబాబుపై ఛీటింగ్‌, సభా హక్కుల ఉల్లంఘన కేసులతో పాటు పరువు నష్టం కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. 

సంఘ్ శక్తులకు పోలీసుల తోడు..

రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్‌(SFI) నేతలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు విరుచుకుపడ్డాయి. జనవరిలో నిర్వహించనున్న అఖిలభారత మహాసభలకు అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా భయోత్పాతం సృష్టించాయి. ఈ దాడిలో సీకర్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుభాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తలకు 25 కుట్లుపడ్డాయి. అయితే సంఫ్‌ు శక్తులకు పోలీసులు తోడయ్యారు. ఫీజులు తగ్గించాలని అడగడమే నేరమైనట్టు.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడగడమే తప్పయినట్టు.. సీపీఐ(ఎం) కార్యాలయంలోకి చొరబడి మరీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను సోమవారం చితకబాదారు. 

జైట్లీని ఇరికించిన స్వపక్షనేత

బీహార్‌కు చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ సొంత పార్టీకే షాక్‌ ఇచ్చారు. ఢిల్లీ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో అవినీతికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కీర్తి ఆజాద్‌ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ అక్రమాల గురించి వివరించారు.డీడీసీఏ పలు కాంట్రాక్టులను టెండర్లు పిలవకుండానే నకిలీ కంపెనీలకు కట్టబట్టిందని ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రాముడి కోసం రాళ్ల తరలింపట..!

రామమందిర నిర్మాణం కోసం హిందూత్వ శక్తులు చురుగ్గా కదులుతున్నాయి. వివాదం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాణ పనుల్ని చేపట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ అవి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా, గత ఆదివారం నాడు ఇక్కడి కార్‌సేవక్‌పురంకు 20 టన్నుల రాళ్లను తరలించారు. రాజస్థాన్‌ నుంచి రెండు ట్రక్కుల్లో ఈ రాళ్లను తీసుకొచ్చారు. అంతే కాకుండా, వీహెచ్‌పీ 'శిలాపూజ' కూడా నిర్వహించిందని సోమవారం వార్తలు వెలువడ్డాయి.

RSSపై ఆరు బుక్లెట్స్ విడుదల..

కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) చేస్తున్న అరాచకాలపై సీపీఐ(ఎం) ఆరు బుక్‌లెట్లు విడుదల చేసింది. 'ఇండియాకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌' పేర.. జాతీయోద్యమంలో ఆ సంఘం వహించిన పాత్రతో మొదలు దేశంలో ఇటీవల చోటుచేసుకున్న బీఫ్‌ రాజకీయాల వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద వైఖరులను ఈ బుక్‌లెట్లలో ఎండగట్టారు. 

నేరతీవ్రతపై శిక్ష పడాలి:ఏచూరి

నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలకు సంబంధించిన అంశంపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. దీనిపై కొందరు బాలనేరస్థుడి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనను ఏచూరి వ్యతిరేకించారు. ఒకవేళ 15 ఏళ్ల 9 నెలల బాలుడు నేరం చేస్తే అపుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక్కడ వయసు ప్రధానం కాదని, నేర తీవ్రతపై శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించాలని ఏచూరి అభిప్రాయ పడ్డారు.

పార్లమెంట్లో DDCA గొడవ..

డిడిసిఏ అక్రమాలపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే.. డిడిసిఏ కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు హంగామా చేశాయి. డీడీసీఏపై చర్చకు వీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది.

కడపలో ఉక్కుపరిశ్రమ కోసం ఆందోళన..

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages

Subscribe to RSS - December