December

ఆపరేషన్ ఆకర్ష్ కు బాబు సిద్ధం..

ఏపీలో చంద్రబాబు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎప్పుడో మొదలెట్టారు. కాని ఇప్పుడు స్పీడు పెంచారు. ఎవరు అడ్డం పడినా కుదరదని పార్టీ నేతలకు చెప్పేశారు. పలువురు నేతలు కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించారు బాబు. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా అన్ని ఆలోచించి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ గండిబాబ్జీలు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు.కాని మంత్రి గంటాను కొంత కాలంగా ఇబ్బందులకు గురి చేసిన కొణతాలను చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని బాబుకు సూచించినట్లు తెలుస్తుంది.

మోడీ రాజీనామాకు కేజ్రి పట్టు ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల గురించి కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో వివరించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోడీ నెరవేర్చుకోవడం లేదని, జైట్లీని డీడీసీఏ అవినీతి ఆరోపణల నుండి రక్షించడానికి సీబీఐ దాడులు చేయించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.

కోడెలపై YCP అవిశ్వాస తీర్మానం

ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసిపి అవిశ్వాస తీర్మాణం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈమేరకు వైసిపి సభ్యులు.. అసెంబ్లీ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందచేశారు. స్పీకర్‌ కోడెల తమ పట్ల పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు.

జైట్లీ రాజీనామాపై ఏచూరి..

డిడిసిఎ కుంభకోణంపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని రాజీ నామా చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలి చ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. హవాలా కేసులో అద్వానీ చేసినట్లుగా ఇక్కడ జైట్లీ కూడా చేయాలని మోడీ భావిస్తు న్నారని ఏచూరి పేర్కొన్నారు. అద్వానీకి, అరుణ్‌ జైట్లీకి పోలిక తీసుకురావడం ద్వారా జైట్లీ రాజీనామా చేయాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకుని తిరిగి రావాలని ప్రధాని మోడీ ఆయనకు ఒక సంకేతం పంపారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

రష్యా అధ్యక్షుడితో మోదీ భేటి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటనకు వెళుతున్నారు. బుధ,గురువారాల్లో ఆయన రష్యాలో పర్యటిస్తారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మోదీ మాస్కాలో సమావేశమవుతారు. ఈ సమావేశం అనంతరం రక్షణ, అణుశక్తికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేసే అవకాశముంది.

జువైనల్ చట్టసవరణ బిల్లు ఆమోదం

బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం జువైనల్ చట్టాన్ని సవరించింది. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. డిప్యూటి ఛైర్మన్ క్లాజుల వారీగా ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ సమయంలో రాజ్యసభలోనే నిర్భయ తల్లిదండ్రులున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందుకు నిరసనగా సభ నుండి సీపీఎం వాకౌట్ చేసింది. చట్టంలో సవరణలను ఎన్ సీపీ, సీపీఎం వ్యతిరేకించింది. చట్టం మరింత ప్రయోజనకరంగా ఉండాలని సీపీఎం పేర్కొంది...

బాక్సైట్‌పై కపటనాటకమాడుతున్న చంద్రబాబు..జి.వో.నెం. 97ను రద్దు చేయాలి. - సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

జాబు కోసం బాబుతో పోరాటమే మార్గం..

వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత.. వెయ్యి అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలనేది కొత్త సామెత.. దీనికి నిదర్శనంగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తోంది. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలలో ఇష్టమొచ్చినట్లు ప్రజలకు, యువతకు హామీలిచ్చేసి... నన్ను నమ్మండి...! నేను మారాను...!! అని అధికారంలోకొచ్చారు బాబు. దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న యువత భవిష్యత్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ''జాబు రావాలంటే - బాబు రావాలనే'' నినాదాన్ని తన పేటేంటుగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులిప్పుడు జాబు అడుగుతుంటే... గుంటూరు జిల్లా సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీ కార్యకర్తలతో....

KCR చండీయాగంపై తమ్మినేని ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం లౌకిక రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. యాగం ఖర్చులపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.  మూఢ విశ్వాసాలను పెంచే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆర్థిక..సామాజిక సమస్యలపై దృష్టి మళ్లించకుండా మూఢ విశ్వాసాల చుట్టూ దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు. 

Pages

Subscribe to RSS - December