District News

 జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రిని ప్రయివేటు సంస్థ మాన్సాస్‌కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం ధర్నా చేశారు. ఆసుపత్రి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి లేని జి ల్లా విజయనగరమేనన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు కూడా జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారని తెలిపారు. కానీ నేడు కేంద్రమంత్రి అశోక్‌గజపతికి చెందిన మాన్సాస్‌ సంస్థ కు కేంద్రాసుపత్రిని కట్టబెట్టాలని నిర్ణయించడం దుర్మార్గమైన...

విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం నాయకులను, రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తోటపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు కింద కాల్వలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు కూడా నిర్ణయించాయని తెలిపారు. వారికి అనుమతి ఇవ్వకపోగా ఇళ్ల నుంచి అర్ధరాత్రి సిపిఎం నాయకులను, నిర్వాసితుల నాయకులు బి రమణ, బి దాసు, సదానందంలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ అరెస్టులు అత్యంత...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

'పోలీసు కేసులకు భయపడితే ఎయిర్‌పోర్టుకు భూములు పోవడం ఖాయం. కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన కౌలువాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. ప్రజాప్రతిఘటన ముందు అన్నీ బలాదూరేనని అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం తొలుత చెప్పిందని, ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గి 5,551 ఎకరాలకు దిగివచ్చిందని తెలిపారు. చంద్రబాబు పేదల భూములతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు....

vzm

Pages