District News

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 
    సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతుందని...

విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎం.ఎల్‌.సి శ్రీ ఎం.వి.ఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. విమ్స్‌ను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేస్తున్న 48 గంటల నిరాహారదీక్షా శిభిరాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, సామాన్య ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌కు 100 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు 600రోజులు పూర్తవుతున్నా...

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

విశాఖకు కెకె లైన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వేజోన్‌పై జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కమిటీల పేర నాన్చుతూ బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. రైల్వేజోన్‌పై జాప్యం ఒడిశా అభ్యంతరాల వల్ల కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పారిశ్రామిక హబ్‌, ఆర్థిక రాజధాని కావాలంటే రైల్వే జోన్‌ అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈస్ట్‌...

మాన్సాస్‌ ట్రస్టు భూములు 99 ఎకరాలు దివీస్‌ లేబొరేటరీకి విక్రయించడంపై న్యాయవిచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దివీస్‌కు తాకట్టుపెట్టిందని విమర్శించారు. ఇక్కడ ప్రజాభిప్రాయసేకణ నిర్వహించకుండా విస్తరణ నిర్మాణపనులు చేపడుతున్న దివీస్‌కు విజయనగరం జిల్లా జి.చోడవరంలో పేదలు సాగుచేసుకుంటున్న అస్సైన్డ్‌ భూములు 43.18 ఎకరాలు అప్పగిస్తూ ఈ నెల ఒకటిన ప్రభుత్వం జిఒ 43 విడుదల చేసిందని తెలిపారు. స్థానికులకు...

 రైవాడ నీరు రైతులకు పునరంకితం అయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. రైవాడ నీరు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైవాడ ఆయకట్టుదారుల నీటి సాధన కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 14న ప్రారంభమైన పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఆనందపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం మాట్లాడారు. రైవాడ నీటిని సాధించేందుకు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఇందుకు ఆయకట్టుదారులు సిద్ధం కావాలన్నారు. రైవాడ జలాశయానికి జివిఎంసి బకాయి పడ్డ రూ.112 కోట్లు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బకాయిలను జివిఎంసి...

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది. ప్రదర్శన చినసాయిబాబా గుడి దగ్గరకు చేరుకొనేసరికి ప్రదర్శనకారులతో యాజమాన్య అనుకూలురు వాదనకు దిగారు. చిప్పాడ...

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది. ప్రదర్శన చినసాయిబాబా గుడి దగ్గరకు చేరుకొనేసరికి ప్రదర్శనకారులతో యాజమాన్య అనుకూలురు వాదనకు దిగారు. చిప్పాడ...

సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని  కోరుతున్నాం.

                నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంకోసం, దేశసమగ్రాభివృద్ధికోసం, మతసామరస్యం కోసం పోరాటం చేస్తున్న సిపియం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేయడమంటే దేశంలో మతోన్మాద శక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమౌతుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతసామరస్యం రోజురోజుకి దిగజారుపోతుంది. దేశవ్యాప్తంగా రచయితలు, అభ్యుదయవాదులపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడు చేసి హత్యలకు ప్పాడుతున్నా ప్రధాన మంత్రి స్పందించడంలేదు అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలా కేంద్ర...

Pages