District News

బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నర్సింగరావు హెచ్చరించారు. ఆయన స్థానిక విలేకర్లతో శుక్రవారం మాట్లాడుతూ, సమతా తీర్పునకు వ్యతిరేకంగా ఎపిఎండిసికి గిరిజన భూములను అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిం చాలన్నారు. వెంటనే జిఒను రద్దు చేయకపోతే నిరవధిక పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. బళ్ళారిలో గాలి జనార్దనరెడ్డి గనులను లూటీ చేసినట్టుగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ను పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. బాక్సైట్‌...

భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఐక్య పోరాటం చేయడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి కె.లోకనాధం పేర్కొన్నారు. ఇండిస్టీయల్‌ పార్కు (పిసిపిఐఆర్‌) పేరుట ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఇండిస్టీయల్‌ పార్కు వ్యతిరేఖ పోరాట కమిటి అధ్యక్షులు లొడగల చంద్రరావు ఆధ్వర్యంలో మూలపర్ర గ్రామంలో రైతులతో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన లోకనాథం మాట్లాడుతూ, భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ ప్రాంత రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతు లంతా ఐక్యంగా భూసేకరణకు వ్యతిరేఖంగా కోర్టును ఆశ్రయించడం తోనే ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 5 సంవత్సరాలైనా వెనక్కి తగ్గిందన్నారు. ప్రభుత్వం రైతులను...

భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ విశాఖ నగరంలోని మేథావులు, రచయితలు, కళాకారులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ, దేశంలో వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గొడ్డు మాంసం తిన్నవాళ్లు ఈ దేశంలో ఉండొద్దని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను అవమానించడమే అవుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజినివ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆదివారం సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు, ప్యాకేజికి తేడా ఉందన్నారు. ప్రత్యేక హోదానిస్తే కేంద్రం నుంచి 10 శాతం నిధులు, 90 శాతం గ్రాంట్లు వస్తాయన్నారు. పట్టిసీమపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్రపై లేదని, సుజలస్రవంతిని విస్మరించారని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన మోడీకి బీహారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారని విమర్శించారు. 

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు సర్వ హక్కులూ ఇస్తున్నాయని, బాక్సైట్‌ వల్ల ప్రభుత్వానికి...

చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖ జిల్లా  సీపీఎం కార్యదర్శి లోకనాధం ఆగ్రహం వ్యక్తం చేసారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్‌ బెస్‌ స్పెషల్‌ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్‌ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 

                నేవల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేటివ్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి) పేరుతో 2005లో ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో 4412.53 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అందులో వేల్పుగుంటపాలెం, రేవువాతాడ, దేవళ్లపాలెం, పిసినిగొట్టిపాలెం గ్రామాల నిర్వాసితులకు ఎన్‌ఎఒబి కాలనీ పేరుతో 373 మందికి ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో  మిగిలిన 34 మందికి దిబ్బపాలెం ఆర్‌హెచ్‌ కాలనీ ఇళ్లు కేటాయింపు జరిగాయి. మొత్తం 407 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరు కాకుండా బంగారమ్మపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం, యాతకొత్తపట్నం, కొప్పిగుంటపాలెం గ్రామాలను ప్రభావిత గ్రామాలగా గుర్తించారు. కానీ నేటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం అంగీకరించిన నష్టపరిహారం చెల్లించలేదు. నేవల్‌ బేస్‌ నుండి...

హుదూద్‌ ఏడాది సంబరా లను విశాఖలో జరిపిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు నష్టపరి హారంపై సమాధానం చెప్పకుండా దాటవే యడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌. నర్సింగరావు వ్యాఖ్యానిం చారు.విశాఖ స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై బహిరంగ విచారణకు సిద్ధమేనా? అంటూ సవాల్‌ చేశారు. తుపానులో ఇళ్లు కోల్పోయిన అత్యధిక మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోగా, దాతలిచ్చిన విరాళాలతో కూడా ఇళ్లు నిర్మించకుండా ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. అత్యధిక మంది మత్స్యకారులకు, గిరిజనులకు, రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదన్నారు. 

Pages