District News

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి...

           విశాఖ జిల్లా జర్రెల బాక్సైట్‌ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి అవాస్తవాలతో వున్నది. జర్రెల బాక్సైట్‌ గనుల్లో అపార నిల్వలు వున్నాయని, ఈ నిల్వలను వెలికితీసి రాష్ట్రానికి ఆదాయం పెంచవచ్చని ప్రభుత్వ ప్రధాన వాదన. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97కు ముందే కాంగ్రెస్‌ మరియు వైఎస్‌ఆర్‌ పార్టీలు బాక్సైట్‌ తవ్వకాల పర్యావరణ అనుమతుల జి.వో జారీచేశాయని, రస్‌ ఆల్‌ఖైమాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో వాదన.  బాక్సైట్‌ అత్యధికంగా వున్న ఒరిస్సాలో తవ్వకాలు జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తవ్వకాలు ఎందుకు జరపకూడదనేది మూడవ వాదన. 19 పేజీల శ్వేతపత్రంలో అత్యధికం మరకలే...

విశాఖ: బాక్సైట్‌ తవ్వకాలను ఐక్యంగా అడ్డుకోవాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. గిరిజన భవన్‌ బాక్సైట్‌ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, గిరిజన చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతర సంస్థ మాత్రమేనని, అటువంటి గిరిజనేతర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గ్రామ సభ లు చేసిన తీర్మానాలే సుప్రీం అని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కంటే గ్రామ సభలకే అధికారం అధికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.

 

 

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

 

   ప్రభుత్వం నాటకాలాడుతోందని, బాక్సైట్‌ జివోను తాత్కాలికంగా రద్దు చేసినట్లు మాట్లాడినా వాటి ప్రమాదం, బాక్సైట్‌ ఒప్పందాల ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం గిరిజనాన్ని హెచ్చరించారు. అందుకే ఆ బాక్సైట్‌ ఒప్పందంపైనే ప్రధానంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజనోద్యోగుల భవనంలో ఆ పార్టీ ఏజెన్సీ 11 మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లో 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. సప్పర్ల, జెర్రెల, జికెవీధి, గాలికొండ కొండల్లో తవ్వకాలు చేపడితే పరిసర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు...

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

బాక్సైట్‌ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎండిసి)కి అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జిఒ 97, బాక్సైట్‌ ఒప్పందా లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. ఏజెన్సీలో గ్రామ సభలు నిర్వహించడం, అటవీ హక్కులచట్టం కింద సాగుదారులకు హక్కుపత్రాలు మంజూరు చేయడం వంటి డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామ న్నారు. ఎన్‌పిఆర్‌ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి గిరిజను లను మోసగించడం కాంగ్రెస్‌, బిజెపి, టిడిపికి...

            

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజాతంత్ర వాదులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం యొక్క తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బాక్సైట్‌ తవ్వకాల జి.వోను వెంటనే రద్దు చేసేలా 16న జరిగే రాష్ట్ర క్యాబినేట్‌లో నిర్ణయం చేయాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. లేనియెడల సిపియం పార్టీ ప్రజా సంఘాలు, సంస్థలు బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడే ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని విశాల ఉద్యమానికి సన్నిద్ధం అవుతుంది.

                బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే  జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లోని 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు...

విశాఖ మన్యంలోని చింతపల్లి, జర్రెల ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ, మండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని పాడేరులోని ఐటీడీఏ వద్ద గిరిజన సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం గిరిజన సంపదను ఇతరులు దోచుకోవడానికి వీల్లేదన్నారు.

భూములు, వృత్తుల పరిరక్షణ కోసం రైతులు, పేదలు, చేతివృత్తిదారులు ఏకోన్ముఖంగా కదలాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. భూముల పరిరక్షణకు ఒకవైపు ప్రజాపోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం దళారీపాత్ర పోషిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత రైతుల భూముల రిజస్ట్రేషన్లు జరిగేలా, భూముల మార్కెట్‌ విలువ పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

Pages