District News

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నా కేంద్ర నుండి రావల్సిన నిధులను ఎందుకు...

హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్‌ ఏర్పాటుచేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశంపై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

                        ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం. 633 ను విడుదల చేసిందని, మెడాల్ సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు...

 గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలతో సహా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి సమస్యలతో పాటు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాంట్రాక్టర్లను సంతృప్తి పర్చేందుకు, గొప్పల కోసం అరకు ఉత్సవాలను నిర్వహించడం సరికాదని సిపిఎం తప్పుపట్టింది. ఉత్సవాల నిర్వహణపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న గిరిజన ప్రజలు, నాయకులను పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్చివేస్తూ అరెస్టు చేయ టాన్ని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తీవ్రంగా ఖండించారు..

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేయాలని, హుదూద్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు, గిరిజనులకు, కూలీలకు పరిహారం చెల్లించాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మ్యూజియం వద్ద నిరసన తెలుపుతుండగా తొమ్మిది మంది సిపిఎం, గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించిన...

ఈ రోజు సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్ పాల్గొన్నారు.....

  • 2000 సంవత్సరంలో టిఎసిలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం చేసినది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
  • 1997లో దుబాల్ కంపెనీతో ఒప్పందాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
  • కాంగ్రెస్ అధికారంలో వుండగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలని కోరినా ఎందుకు రద్దు చేయలేదు?
  • ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడంలేదు?
  • 2007-08లో రస్ఆల్-ఖైమాతో జరిగిన ఒప్పాంలు తప్పులతడకని కాగ్ నివేదికపై తెలుగుదేశం ప్రభుత్వం...

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

                చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా తన హాయంలో విడుదల చేసిన జి.వో.నెం.97ను, అన్‌రాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను...

హుదూద్‌ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వామపక్షాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గిరిజన గర్జనలో భాగంగా  నర్సీపట్నంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందకారత్  బాక్సైట్ తవ్వకాలపై  ప్రెస్మీట్ నిర్వహించారు.బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని  విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Pages