District News

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్వంలో నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దోమల నుంచి రక్షించండి, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ, విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు కబోది పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడంలేదన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పముజుల దశరథరామయ్యపై నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరులో మంగళవారం హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రూ.5లక్షలతో పంచాయతీ డ్రైనేజీ కాలువ నిర్మిస్తోంది. అయితే, హైస్కూల్‌ కూడలిలో స్థానికంగా నివాసముండే బట్టేపాటి ప్రతాప్‌ కాలువ తమ స్థలంలో ఉందంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. గ్రామపెద్దలు, సీపీఐ సీనియర్‌ నేత పముజుల దశరథరామయ్య జోక్యం చేసుకుని డ్రైనేజీ కాలువ పూర్తిగా పంచాయతీ స్థలంలో ఉందని, రెవెన్యూ సర్వే ప్రకారమే నిర్మాణం జరుగుతోందంటూ తేల్చి చెప్పారు. అయినా మాటవినని ప్రతాప్‌ పముజులపైకి దూసుకెళ్లాడు. గడ్డపారతో దశరథరామయ్యను పొడిచేందుకు ప్రయత్నించగా...

కేంద్రం సవరించిన చట్టాలు అమల్లోకి వస్తే కార్మికులు బానిసత్వంలో కూరుకుపోతారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులనుప్రభుత్వాలు కాలరాస్తు న్నాయని విమర్శించారు. కేంద్రం 5 కార్మిక చట్టాలు చేసింద న్నారు. సమ్మెలు నిషేధించడం, యాజమాన్యానికి అనుకూ లంగా పనిచేయడం, యూని యన్లు పెట్టకుండా నిరోధి ంచడం వంటివి అందులో ప్రధానమైనవని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు, విదేశీ పెట్టుబడిదారుల షరతులకు లోబడి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. కార్మికులంతా సంఘటితమై...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు. బడ్జెట్‌ సమావేశాలలోపు ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒక...

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు. కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో...

నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున మైనార్టీల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. 

 

నెల్లూరు:సొంత జిల్లాలో మంత్రి నారాయణకు చుక్కెదురైంది. తెలుగు గంగ కాలువ నిర్మాణ పనుల పరిశీలకు వెళ్లిన నారాయణను నీటి బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. పక్కనే స్వర్ణముఖి నది ఉన్నా తాగు నీటి సమస్య తీరలేదని నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు అడ్డుతొలగేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో నారాయణ ఫోన్‌లో మాట్లాలో హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.

వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్‌, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్‌ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్‌ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్‌ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ 10...

గూడూరులో జరిగిన కామ్రేడ్ ఇందుకూరు జనార్ధన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మీటింగ్ హాలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ,స్థానిక సిపిఎం నాయకులు,పార్టీ అభిమానులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Pages