District News

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వమే పొదుపు చెల్లిస్తుందనే పేరుతో వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీ మీద వడ్డీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బకాయిలున్నాయనే...

 నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది. దానికి సంబంధించిన సవిరమైన నివేదికను రూపొందించే బాధ్యతను మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి గతేడాది అప్పగించింది. డీఎంఆర్‌సీ కొద్ది...

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు? ఎప్పుడో ఏడాది కింద ఇచ్చిన హామీ జనానికి గుర్తుండదని కాబోలు ముఖ్యమంత్రి 2015-16లో రూ.1,25,748 కోట్లతో మరోసారి వంచించే...

కుల వ్యవస్థపై పోరాటానికి సివి రచనలు ఆయుధంగా ఉపయోపడతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. విజయవాడలోని వేదిక కళ్యాణ మంటపంలో ఆదివారం సాహితీ, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యాన 'సివి సమగ్ర రచనలు - సమాలోచన' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అధ్యక్షత వహించారు. సమాలోచనలో భాగంగా 'కులం-వర్గం - సివి విశ్లేషణ' అంశంపై జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక విప్లవం అవసరమని సివి రచనలు మనకు చెబుతున్నాయన్నారు. సాంస్కృతిక ప్రతీఘాత విప్లవం సృష్టించడానికి బిజెపి, సంఫ్‌ు పరివార్‌లు ప్రయత్నిస్తున్నాయన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను హరిస్తున్నాయని పేర్కొన్నారు. రచయితల...

30-06-2015 సాయంత్రం 6 గం।। లకు 

హనుమంతరాయ గ్రంధాలయం ,గాంధీనగర్ ,విజయవాడ 

ముఖ్య అతిధి : బివి రాఘవులు 

Pages