District News

కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ర్టాల జుట్లు ముడేసింది. రాష్ర్టాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన కేంద్రం.... తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ‘ట్యాపింగ్‌’ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిందిపోయి... సర్వీస్‌ ప్రొవైడర్లను వెనుకేసుకొచ్చే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య మరింత పెరిగేలా లేఖలు రాసింది. ‘మేం ట్యాపింగ్‌ చేయలేదు!’ అని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తుండగా... ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్‌ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో... ‘...

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే తోడు వచ్చే పార్టీలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఏపీ ఎంపీలకు హిజ్రాలతో సన్మానం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. 

అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్‌, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.

మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్‌ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్‌ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు. కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్‌ జెఎసి నాయకులను అరెస్టులు చేశారు. మహిళా కార్మికులను, మహిళా నాయకులను...

 'గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లు తో ప్రజలపై పెనుభారం పడుతుంది'. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ ముందడుగు వేయడానికి కేంద్రం సిద్దమైందని అన్నారు..

విజయవాడ లో సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో పలువురికి...

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Pages