District News

జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలురైతులకు వెంటనే పంటరుణాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. అమరావతి కళ్లం బ్రహ్మయ్య స్మారకభవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది కౌలురైతులుండగా కేవలం 30 వేల మందికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని అన్నారు. పది వేల మందికి మాత్రమే పంటరుణాలు మంజూరు చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి కౌలురైతుకు గుర్తింపుకార్డులిచ్చి పంటరుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పిందని అన్నారు. బ్యాంకులో రుణాలు మంజూరుకు ఆటంకం కలిగిస్తున్నారని జిల్లా ప్రభుత్వం జోక్యం చేసుకుని రుణాలు మంజూరు చేయించాలని కోరారు. గుంటూరు మార్కెట్‌యా...

పెట్టుబడి దారి వ్యవస్థలో పాలకులు అవలంభిస్తున్న వైఖరి వల్ల దేశంలో దోపిడీ, ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ పేర్కొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యత' అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరిగింది. శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శర్మ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి వ్వవస్థ నుంచి మార్పును, విప్లవాన్ని కోరుకునే వారు తప్పని సరిగా కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంధం చదవాలని కోరారు. పెట్టుబడీదారీ విధానానికి జీవకణం సరుకు అని, నీటిని, అంతరిక్షాన్ని సరుకుగా మార్చి సంపదగా కొంత మంది దోచుకుంటున్నారని అన్నారు. మానవ...

మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్న క్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి వారితో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను రూపొందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'అక్టోబర్‌ మహా విప్లవ శతవార్షికోత్సవ సభ'కు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ.. అన్ని దేశాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతోనే ఉద్యమాలు నడుస్తున్నాయని చెప్పారు....

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు. చిలకలూరిపేట డివిజన్‌ సిపిఎం కన్వీనర్‌ పోపూరి సుబ్బారావు, సిపిఎం డివిజన్‌...

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు. అలాగే పెట్టుబడి గ్రంధం ప్రాముఖ్యత అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌....

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి గాడిదమళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పాశం రామారావు మాట్లాడుతూ చేజర్ల గ్రామంలో సిపిఎం నిర్మాణం పటిష్టంగా ఏర్పడాలని, ప్రజా సమస్యలపై కార్యకర్తలు...

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తి, సేవా తత్పరితతో శివారెడ్డి, ఆయన కుటుంబం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కొనసాగడం ఎంతో అభినందనీయమని...

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.
సభలో పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.. శివారెడ్డి 90 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 70 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకు పోయిందన్నారు. ప్రజా ఉద్యమాలు, అక్టోబరు...

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు. జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో శివారెడ్డి పాత్ర కీలకమన్నారు. అనేక రైతాంగ, వ్యవసాయ కార్మిక...

ప్రమాదాలు జరిగిన వెంటనే మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఎస్సీకాలనీలో గత నెల 20వ తేదీన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు, పొగాకు కొస్టాలు దగ్ధమై తీవ్ర నష్టంవాటిల్లి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. విజయవాడ పాపులర్‌ షూమార్ట్‌ వారి సహకారంతో దుప్పట్లు, టవళ్లు, ఇనుప మంచాలు సోమవారం విఠంరాజుపల్లి బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం వాటిల్లడం బాధాకరమన్నారు.బాధితులను ఆదుకునేందుకు వైసిపి, శివశిక్తి ఫౌండేషన్‌, గ్రామ...

Pages