District News

పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూములలో వెంటనే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం స్థానిక కన్నెగంటి హనుమంతు భవన్‌లో సిపిఎం నాయకులు లేళ్ల లక్ష్మిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ 12సంవత్సరాల క్రితం సిమెంట్‌ఫ్యాక్టరీల కోసం వివిధ ప్రైవేటు సంస్థలు 12వేల ఎకరాలు భూములను పల్నాడు ప్రాంతంలో సేకరించారని ఇప్పటి వరకూ ఒక్కఫ్యాక్టరీ కూడా నిర్మించలేదన్నారు. వెంటనే పరిశ్రమలు స్థాపించి యువకులకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాలని కోరారు. కేంద్రప్రభుత్వం నల్లధనం...

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఫారెస్ట్‌ డిపార్టుమెంటు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ అధికారులు...

యడ్లపాడు మండలంలో దళితులు సాగు చేసుకునే భూములు ఆక్రమణలకు గురయ్యాయని, శ్మశాన స్థలాలు లేక దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. దళితుల సమస్యపై నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారానికి మూడో రోజుకు చేరింది. యాడ్లపాడులో ప్రారంభమైన యాత్ర కారుచోల, ఉన్నవ, వంకాయపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, కొత్తసొలస, పాత సొలస, కొండవీడు, ఛంగీజ్‌ఖాన్‌పేట, సంగం, బోయపాలెం తదితర గ్రామాల్లో దళితవాడల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి సమస్యలు వెల్లువెత్తాయి.మండలంలో అనేక గ్రామాలలో దళితులు సాగు చేసుకునే భూములు, శ్మశాన భూములు ఆన్యాక్రాంతమవుతున్నాయి. నీరు చెట్టు పేరుతో...

సామాన్లు సద్దుకుంటామన్నా ఆగకుండా ప్రొక్లేయిన్ల్‌తో మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది ఇళ్లను కూల్చివేయించారని వావిలాలఘాట్‌ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వావిలాల్‌ఘాట్‌ వాసులు సామన్లు సద్దుకుంటుం డంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో మున్సిపల్‌ అధికారులు వారి ఇళ్లను నేల మట్టం చేసిన విషయం విధితమే. వావిలాలఘాట్‌ పార్క్‌ అభివృద్ధికి వావిలాలఘాట్‌లో నివాసం వుంటున్న 102 కుటుంబాల ఇళ్లను పీకివేసి ఎస్‌పిజి డిగ్రీకళాశాల్లో చూపించిన ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లి ఇళ్లు అక్కడవేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ ట్రాక్టర్‌లతో మున్సిపల్‌ సిబ్బంది వారి సామన్లను ప్రత్యేమ్నాయ స్థలంలోకి తరలించి వేశారు. ఈ సందర్బంగా బుధవారం...

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ భూములను పి.మధు పరిశీలించి హక్కుదార్లతో...

భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు. ఎస్‌టి కాలనీలో ఒక్క ఇంటిలోనే రెండుమూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కాలనీ పక్కనే నిరుపయోగంగా ఉన్న...

శావల్యాపురం మండలంలోని కనమ ర్లపూడి, శావల్యాపురం, పోట్లూరు, ఇర్లపాడులో సిపిఎం పాదయాత్ర సాగింది. కనమర్లపూడి ఎస్‌సి కాలనీలో తాగునీరు, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలను, శావల్యాపురంలో ఇళ్ల పట్టాలు, స్థలాలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. శ్మశానా స్థలాల పక్క పొలాలవారు దారి మూసేశారని తెలిపారు. పోట్లూరు ఎస్‌సి కాలనీలో దగ్గర్లోని ఐదెకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను పేదలకివ్వాలని, గ్రామంలో 300 మంది అగ్రీగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇర్లపాడులో దళితులకు సంబంధించిన ఐదెకరాలను పెత్తందార్లు ఆక్రమించారని, ఎదిరించిన వారిపై కేసులు పెడుతున్నారని అక్కడివారు వాపో యారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు సైతం అర్హులకు ఇవ్వడం లేదని బృందానికి తెలిపారు...

పనులు లేకుండా ఇళ్లల్లోని మగాళ్లతో మద్యాన్ని తాగబోస్తున్నారని అన్నవరప్పాడు మహిళలు వాపోయారు. పిల్లలను పోషించేందుకు అంతులేని అగచాట్లు పడుతున్నామని, కాస్తో కూస్తో కూలి డబ్బులున్నా వాటిని మార్చుకోడానికి బ్యాంకుల వద్ద పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావని ఆవేదనను వెళ్లగక్కారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. అన్నవరప్పాడులోని మహిళలు సిపిఎం బృందానికి తమగోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్‌ 50 యూనిట్లయితే బిల్లు లేదని చెప్పినా తమ వద్ద వసూలు చేస్తున్నారని, పనుల్లేక మిర్చి తోడాలు తీయడానికి వెళ్తే ఊపిరి తిత్తుల సమస్యలు వేధిస్తున్నాయని, జ్వరమొచ్చినా మందుబిళ్ల కొనలేని దుస్థితి నెలకొందని కన్నీరు పెట్టుకన్నంత పని...

పేదల కోసమని పెదరావూరులో సేకరించిన భూమిని అర్హులకు పంపిణీ చేయకుంటే ఆ భూమిలో సిపిఎం జెండాలు పాతి పంచుతుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి చెప్పారు. 11 రోజులుగా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వైకుంఠపురం కాల్వకట్ట, నరేంద్రదేవ్‌కాలనీ, హడ్కోకాలనీ, చినరావూరు తోట, చినరావూరు డొంక తదితర ప్రాంతాల్లో సాగింది. 50 ఏళ్ల నుండి వైకుంఠపురం కాల్వకట్ట, చినరావూరు డొంక రోడ్డులలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, పట్టాల కోసం నాయకులను వేడుకుంటుంటూ పదేళ్ల నుండి ఊరుకుని గెలిచి రెండేళ్లే అయిన మమ్మల్ని అడిగితే ఎక్కడి నుండి తెస్తామని అంటున్నారని వాపోయారు. పాముల భయం, దోమల ఉధృతి, అంటు రోగాలతో నిత్యం సతమతమవుతున్నామని ఆవేదనకు గురయ్యారు. గృహ...

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు సిపిఎం పాదయాత్ర బృందం ఎదుట వాపోయారు. గురవారం మండలంలోని ఆయా గ్రామాలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈసందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు జి. బాలకృష్ణ మాట్లాడుతూ మండలం లోని ఆయా గ్రామాల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వాటర్‌ట్యాంక్‌లు నిర్మించినప్పటికీ పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంలేదని అన్నారు. రుద్రవరం, దమ్మాలపాడు, తొండపి, పలుదేవర్లపాడు గ్రామాల్లో వీధిలైట్లు లేక చీకటిలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలే లైట్లు వెలుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించు కోవడంలేదన్నారు.

Pages