District News

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తి, సేవా తత్పరితతో శివారెడ్డి, ఆయన కుటుంబం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కొనసాగడం ఎంతో అభినందనీయమని...

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.
సభలో పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.. శివారెడ్డి 90 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 70 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకు పోయిందన్నారు. ప్రజా ఉద్యమాలు, అక్టోబరు...

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు. జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో శివారెడ్డి పాత్ర కీలకమన్నారు. అనేక రైతాంగ, వ్యవసాయ కార్మిక...

ప్రమాదాలు జరిగిన వెంటనే మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఎస్సీకాలనీలో గత నెల 20వ తేదీన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు, పొగాకు కొస్టాలు దగ్ధమై తీవ్ర నష్టంవాటిల్లి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. విజయవాడ పాపులర్‌ షూమార్ట్‌ వారి సహకారంతో దుప్పట్లు, టవళ్లు, ఇనుప మంచాలు సోమవారం విఠంరాజుపల్లి బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం వాటిల్లడం బాధాకరమన్నారు.బాధితులను ఆదుకునేందుకు వైసిపి, శివశిక్తి ఫౌండేషన్‌, గ్రామ...

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన మహా యోధుడు సింహాద్రి శివారెడ్డిని ఆయన ఆశయబాటలో నేటి యువతరం పనిచేయాలని సిపిఎం జిల్లాకార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మారక భవన్‌లో నిర్వహించిన శివారెడ్డి సమస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. 1928లో ఖాజా గ్రామంలో ధనిక కుటుంభంలో పుట్టిన శివారెడ్డి ఆ ప్రాంతం రైతాంగ సమస్యల కోసం 1944లో గ్రామంలో రైతుసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత 1946లో పార్టీ శాఖ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోను, మంగళగిరి ప్రాంతంలోను జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు. వీరతెలంగాణా సాయుధ పోరాటంలో నాటి ధళాల్లో చేరి పోరాటానికి...

మండలంలోని విఠంరాజుపల్లిలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలకు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వంటసామగ్రిని, దుస్తులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయటంతో పాటు ప్రమాదంలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు భోజనప్లేట్లు, చెంబులు, గ్లాసులు, టిఫిన్‌ బాక్స్‌లు అందించారు. ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస రడ్డి దుస్తులు, వంటసామాగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు.

పీడిత వర్గాల తరపున పోరాడే క్రమంలో ఆదర్శనీయ జీవితం గడిపిన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి మహోన్నతుల కోవలోకి సింహాద్రి శివారెడ్డి త్యాగమయ జీవితం చేరుతుందని, పేదల గుండెల్లో ఆయన కలకాలం నిలిచిపోతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. శనివారం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని శివారెడ్డి నివాసం వద్ద మంగళగిరి డివిజన్‌ కార్యదర్శి జె.వి.రాఘవులు అధ్యక్షతన శివారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తనతోపాటు కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కూడా పీడిత వర్గాల కోసం పని చేసే విధంగా తీర్చిదిద్దటం అత్యంత గొప్ప విషయమన్నారు. సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అన్ని సామాజిక తరగతుల్ని...

క్వింటా మిర్చి కి రూ.12 వేలు, క్వింటా కందికి రూ.7,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. బుధవారం క్రోసూరులోని ఆమంచి భవనంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆవుల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. జరిగింది. పాశం రామారావు మాట్లాడుతూ మిర్చి ఒక ఎకరం పండించడానికి 1.25 లక్షలు ఖర్చవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి పరోక్షంగా రూ.40 వేలు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.12 వేలు ఉన్న మిర్చి క్వింటా ప్రస్తుతం రూ.ఏడు వేలకు పడిపోయింది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పు ధాన్యాల వ్యవసాయం...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులను కూలీలుగా మారుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసదస్సులో పాల్గొనేందుకు బుధవారం నరసరావుపేట వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల పట్ల సిపిఎం జేజేలు పలుకుతుందన్నారు. వేముల రోహిత్‌ ఎస్‌సిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన గుంటూరు కలెక్టర్‌ నేడు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల బీసీనా, ఎస్‌సినా అనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. నిలకడ లేని నష్టదాయక విధానాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. చేతికొచ్చిన మినుము, కంది, పెసర పంటలకు మద్దతు ధర లేక రైతులు...

ఉండవల్లి హరిజనవాడకెళ్లే దారిలో ప్రభుత్వ భూమికి సంబంధించిన స్థలంలో ఇళ్లు వేసుకుంటామని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు స్థలాల్లోకి శనివారం చేరుకున్నారు. పుష్కరాల సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ళస్థలాలిస్తామని హామీనిచ్చి మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం పేదల ఇళ్లు తొలగించారు. నెలలు గడుస్తున్నా పేదలకు స్థలాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇందుకు ఉండవల్లి హరిజనవాడకెళ్ళే దారిలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మున్స్పిల కార్యాలయ ముట్టడి చేపసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పేదలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో పేదలు సిపిఎం నాయకులతో కలిసి...

Pages