District News

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

 ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులను నిర్బంధించి వారి భూములను సాగు చేసుకుంటున్నారనే విషయం తెలుసుకుని వారికి మద్దతుగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నాయకులు వై.వెంకటేశ్వరరావులను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి.అధికార యంత్రాంగం పెత్తందారులకు మద్దతుగా పోలీసులను పంపించి వారి పహారాలో దళితుల భూముల్లో చెరువులు తవ్వుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, దేవరపల్లి దళితులు సాగులో ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పార్టీ శ్రేణులను కోరారు.

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ సిపిఎం, వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన 'చలో భీమవరం' కార్యక్రమాన్ని పోలీసులు ఉద్రిక్తంగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సహా 151 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాలుగురోజుల కిందటే 'చలో భీమవరం' కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నోరు విప్పని పోలీసులు చివరి నిమిషంలో సభకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు యత్నించారు. మంగళవారం సాయంత్రం నుంచే భీమవరం, గరగపర్రులో భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు. సభా ప్రాంగణమైన భీమవరం పాత బస్టాండ్‌ వద్ద వందలాదిమంది పోలీసులు మోహరించి, ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గరగపర్రు నుంచి దళితులంతా ర్యాలీగా...

రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్‌ నిర్వహిస్తామనగానే జూన్‌ రెండు నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు అన్నారు. హామీల అమ‌లు మాటల‌లో కాకుండా చేతల్లో చూపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని , అదే విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని మ‌ధు డిమాండ్ చేశారు.

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.
సభలో పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.. శివారెడ్డి 90 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 70 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకు పోయిందన్నారు. ప్రజా ఉద్యమాలు, అక్టోబరు...

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు. జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో శివారెడ్డి పాత్ర కీలకమన్నారు. అనేక రైతాంగ, వ్యవసాయ కార్మిక...

ప్రమాదాలు జరిగిన వెంటనే మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఎస్సీకాలనీలో గత నెల 20వ తేదీన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు, పొగాకు కొస్టాలు దగ్ధమై తీవ్ర నష్టంవాటిల్లి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. విజయవాడ పాపులర్‌ షూమార్ట్‌ వారి సహకారంతో దుప్పట్లు, టవళ్లు, ఇనుప మంచాలు సోమవారం విఠంరాజుపల్లి బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం వాటిల్లడం బాధాకరమన్నారు.బాధితులను ఆదుకునేందుకు వైసిపి, శివశిక్తి ఫౌండేషన్‌, గ్రామ...

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన మహా యోధుడు సింహాద్రి శివారెడ్డిని ఆయన ఆశయబాటలో నేటి యువతరం పనిచేయాలని సిపిఎం జిల్లాకార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మారక భవన్‌లో నిర్వహించిన శివారెడ్డి సమస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. 1928లో ఖాజా గ్రామంలో ధనిక కుటుంభంలో పుట్టిన శివారెడ్డి ఆ ప్రాంతం రైతాంగ సమస్యల కోసం 1944లో గ్రామంలో రైతుసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత 1946లో పార్టీ శాఖ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోను, మంగళగిరి ప్రాంతంలోను జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు. వీరతెలంగాణా సాయుధ పోరాటంలో నాటి ధళాల్లో చేరి పోరాటానికి...

మండలంలోని విఠంరాజుపల్లిలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలకు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వంటసామగ్రిని, దుస్తులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయటంతో పాటు ప్రమాదంలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు భోజనప్లేట్లు, చెంబులు, గ్లాసులు, టిఫిన్‌ బాక్స్‌లు అందించారు. ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస రడ్డి దుస్తులు, వంటసామాగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు.

Pages