District News

గ్రామాల్లో వెంటనే కూలిపనులు లేని పేదలందరికీ ఉపాధి హామీ పనులు చూపించి వలసలను అరికట్టాలని సిపిఎం పార్టీ డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజు సత్తెనపల్లి మండలంలోని కట్టావారిపాలెం, పెదమక్కెన, గుడిపూడి, నందిగం, భీమవరం గ్రామాల్లో సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని, తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చూపించాలని గ్రామస్తులు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పెదమక్కెనలోని ఎస్సీకాలనీవాసులు రాజకీయ కక్ష్యతో దళితులకు ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఇవ్వలేదన్నారు. వెంటనే తమకు జాబ్‌కార్డులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని...

రేపల్లె డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రేపల్లెలో సోమవారం ప్రారంభమయ్యాయి. యాత్రను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బిఎల్‌కె.ప్రసాదు ప్రారంభించగా జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ మాట్లాడారు. పట్టణంలో అనేక సమస్యలున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, ఒకటో వార్డు రెండో వార్డు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 14 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా నేటికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క ప్రభుత్వ కుళాయి కూడా లేదని అన్నారు. అర్హతున్నా పింఛన్లు రానివారు ప్రతివార్డులోనూ ఉన్నారని, రెండేళ్లుగా...

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ఎం.పకీరయ్య అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వం వారి నుంచి భూములను సమీకరించి ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల్లేక వెలవెలబోతున్న యూని వర్సిటీలను సంరక్షించకుండా...

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నగరంలో మురికివాడల్లో సమస్యలు తిష్ట వేశాయని, టిడిపి తన ఎన్నికల వాగ్దానాలు మరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. 24వ తేదీ వరకు నగరంలో సిపిఎం నిర్వహించే పాదయాత్రలు ఆదివారం సంగడిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో పాశం రామారావు మాట్లాడుతూ టిడిపి తన మ్యానిఫెస్టోలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇస్తామని రెండున్నరేళ్ల పరిపాలనలో ఒక్క సెంటు కూడా పంపిణీ చేయలేదన్నారు. నగరంలో 35 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు. మరో 5 వేల కుటుంబాలు రైల్వే ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారని, ఆయా స్థలాలకు పట్టాలు...

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ...

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాద‌యాత్ర న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌లోనూ సాగుతుంద‌న్నారు. 

విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్‌ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దోమల బెడదతో అల్లాడి పోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, డ్వాక్రా రుణ మాఫీ సక్రమంగా జరగలేదని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారనీ, కానీ ఎవరికీ జాబు రాలేదని వివరించారు.

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

Pages