District News

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాజకీయ స్వార్థం, అధికారం దాహం కోసం మతచిచ్చు, కుల చిచ్చు...

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సంక్షేమ పథకాలను టిడిపి అనునూయులు మాత్రమే లబ్ధిపొందేలా ప్రభుత్వం కుట్ర పూరితమైన కక్షసాధింపుతో ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జన్మభూమి...

పేదలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో ఇటీవల పేదలు స్వాధీనం చేసుకున్న ఉన్న 570 సర్వే నెంబర్‌ స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ధనికులకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతోందన్నారు. కొండలకు కూడా పట్టాలు ఇచ్చి వారికి పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం వారు ముందుకు రాలేదన్నారు. రెండు విడతల జన్మభూమిలో జిల్లా వ్యాప్తంగా 57,376 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చారన్నారు. ఇందులో కేవలం 16 వేల మందికి మాత్రమే పట్టాలు ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోందన్నారు. 22 మండలాల్లో 37 వేల ఎకరాల...

ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లోని జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన 'పాలకుల విధానాలకు అన్నదాతలు బలి' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో జిల్లాలో 162 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నూతన సంవత్సరం జనవరి మాసంలో 25 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సంక్రాంతి పండుగ నుంచి 16 మంది రైతులు బలవన్మరాలకు పాల్పడ్డారని తెలిపారు. రోజు రోజుకూ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని...

సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, నిర్వాసిత రైతులను ప్రభుత్వం నిర్బంధించింది. అరెస్టు చేసి 22 మందిని జైలుకు పంపింది. అనంతపురం జిల్లా ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించ కుండానే భూములను కంపెనీకి కట్టబెట్టింది. నిర్వాసిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సిపిఎం మద్దతిచ్చింది. సోలార్‌ భూముల్లోకి చొచ్చుకెళ్లి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎర్రజెండాలను పాతారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పనులు సాగనీయబోమని హెచ్చరించారు.

కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే, ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమ నాయకుడు యూసఫ్‌ తరిగామి సోమవారం పరామర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన 16 మాసాల్లో అనంతపురం జిల్లాలో 39 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.

మంచి రోజులు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బిజెపి, అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు మాత్రమే మంచి రోజులు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోందని జమ్మూ కాశ్మీర్‌ శాసనసభలో సిపిఎం పక్ష నేత యూసుఫ్‌ తరగామి స్పష్టం చేశారు. అవాజ్‌ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించారు. సభలో తరగామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 'అచ్చేదిన్‌ ఆయేంగే' అంటూ ప్రచారాన్ని పెద్దఎత్తున బిజెపి చేపట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

అనంతపురం జిల్లాలో సోలార్ హబ్ కోసం NTPC రైతుల వద్ద నుండి పదివేల ఎకరాలను  సేకరిస్తోంది. నష్ట పరిహారం అర్హులైన రైతులకు కాకుండా  బినామీలకు కట్టబెట్టేల అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు.దీనిపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.వీరికి అండగా నిలబడిన సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధుని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసారు.. 

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీపుజాతాను ప్రారంభించారు. తొలిరోజు రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో జాపుజాతా పర్యటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎనిమిదేళ్లుగా తీవ్ర కరువు నెలకొందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం రూ.210 కోట్లు కేటాయించి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరనలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జిల్లా రైతులకు తక్షణమే...

Pages