హోదాతోనే అభివృద్ధి:పాటూరు

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.కర్నూలులోని సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ద్దేశించి పాటూరు మాట్లాడుతూ, రైతాంగం, శ్రమ జీవుల కష్టాలు, నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. విడిపోయే సందర్భంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాము కోరామని, ఈ విషయం గురించి ప్రధాని ఏమీ మాట్లాడడంలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు, కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.