హస్పిటల్ లో చికిత్స పొదితున్న ఆంజినేయులను పరామర్సించిన :- పి.మధు

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుని పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడిని కలుసుకుని ఆంజనేయులు ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాడిలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సతీష్‌నూ పరామర్శించారు. ఆంజనేయులు భార్య మల్లేశ్వరితో మాట్లాడారు. పార్టీ అండగా నిలుస్తుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పేదల కాలనీలను దౌర్జన్యంగా తరిమేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రౌడీషీటర్ల విషయంలో సరైన విధంగా స్పందించని తాలూకా సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. చర్యలు తీసుకోకపోగా రౌడీషీటర్లు అధికార పార్టీకి చెందిన వారని, వారిపై చర్యలు తీసుకోలేమని సిఐ సమాధానం చెప్పడం పోలీసు శాఖ దౌర్భల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఇది అనుమానాలకు తావిస్తోందన్నారు. 2007లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ పోరాటంలో వేల మంది ప్రజలు, నాయకులు జైళ్ల పాలయ్యారని, కొందరు అమరులయ్యారన్నారు. వారి త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న పేదల కాలనీలను కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కాలనీ ప్రజలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పెద్దల అండ చూసుకొని తీసుకెదాడుతీసుకెలకు పాల్పడుతున్న వైనాన్ని సిఎం దృష్టికీ తీసుకెళతామని చెప్పారు. నిందితులను గుర్తించి తక్షణమే పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు. అనంతరం అర్బన్‌ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠితో ఫోన్‌లో మాట్లాడారు. కేసులో పురోగతి సాధించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.