స‌దావ‌ర్తి స‌త్రం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచారించాలి. సిపియం జిల్లా కార్య‌ద‌ర్శి పాశం రామారావు.

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌. స‌మారు 480 కోట్లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం 22 కోట్ల‌కే వేలంలో పోంద‌డం అంటే అనేక అనుమానాల‌కు తావిస్తున్న‌ది. విటిని రియ‌ల్ఏస్టేట్ వ్యాపారుల‌కు, పాల‌క వ‌ర్గాల అనుయాయుల‌కు క‌ట్ట‌బెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. మ‌హానాడులో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ అవినీతికి దూరంగా ప‌రిపాల‌న న‌డుపుతున్నామ‌ని అన్నారు. ఈ భూముల విష‌యంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌లుపై స‌మాధానం చెప్పాల‌ని, నిజ‌నిజాలు తెలియ‌డం కోసం హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించి వాస్త‌వ విష‌యాల‌ను బ‌య‌ట పెట్టాలి.