సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలి..

సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, నిర్వాసిత రైతులను ప్రభుత్వం నిర్బంధించింది. అరెస్టు చేసి 22 మందిని జైలుకు పంపింది. అనంతపురం జిల్లా ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించ కుండానే భూములను కంపెనీకి కట్టబెట్టింది. నిర్వాసిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సిపిఎం మద్దతిచ్చింది. సోలార్‌ భూముల్లోకి చొచ్చుకెళ్లి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎర్రజెండాలను పాతారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పనులు సాగనీయబోమని హెచ్చరించారు.