సీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు

రాయలసీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో కొనసాగింది. 
పుట్టపర్తి అర్బన్‌:రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీ కోసం మార్చి 15న అసెంబ్లీని ముట్టడిస్తామని, ఇందులో అరెస్ట్‌లకు కూడా సిద్ధమని సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకలు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం బస్సు యాత్ర పుట్టపర్తికి చేరుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్‌ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర పునర్‌విభజన చట్టంలోని అంశాలను కేంద్రం అమలు చేయలేదన్నారు. రాయలసీమలో కరవు, వలసలు పెరుగుతున్నా పాలకులు పట్టించుకోలేదన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. హంద్రీనీవాకు కేవలం రూ.200 కోట్లు కేటాయించడంతో పనులు మందుకు సాగలేదన్నారు. జిల్లాలో ఒక్క పరిశ్రమను కూడా ఇంత వరకు ఏర్పాటు చేయలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు విఫలం అయ్యారని విమర్శించారు. రాయలసీమను ఆదుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మురళి, సిపిఐ, సిపిఎం నాయకులు నారాయణస్వామి, కొండారెడ్డి, ఆంజనేయులు, లక్ష్మినారాయణ, బాబావలీ, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 
నల్లమాడ:కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ సమగ్ర అభివృద్దిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఉభయ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో బస్సు యాత్రను నిర్వహించారు. ఈ బస్సు యాత్ర కు సిపిఎం నుంచి రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఓబులు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మురళీ, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, జిల్లా నాయకులు నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ అనంత వాసులతో పాటు కర్నూల్‌, కడప, చితూర్తు జిల్లాలో కనీసం తాగడానికి గుక్కెడు నీరు కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, నాయకులు, ఓబులేశు, రైతు సంఘం జిల్లా నాయకులు పెద్దారెడ్డి, సిఐటియు నాయకులు ఇంతియాజ్‌, డివిజన్‌ నాయకులు కొండారెడ్డి, గోవిందు, తిప్పన్న, ఓడి చెరువు మండల కార్యదర్శి రమణ, శ్రీనివాసులు, సిపిఐ నాయకులు అంజి, కుంచెపు చంద్ర, మున్నా తదితరులు పాల్గొన్నారు. 
కదిరి:రాయలసీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులైనా రాయలసీమకు అన్యాయమే జరిగిందని రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురమని దీనికి కారణం పాలకుల విధానాలే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. శనివారం బస్సుయాత్ర సందర్భంగా కదిరిలోని స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విభజన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురమన్నారు. ఈ జిల్లాలో నదులు లేవన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, గాలేరు, నగరి, కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలన్నారు. రైతులకు న్యాయమైన నష్టపరిహరం ఇచ్చేంతవరకు ఎన్‌పికుంటను వదిలిపెట్టమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, రాయలసీమ అభివృద్ధి సంఘం కన్వీనర్‌ ఓబులు, ఇంతియాజ్‌, బడా సుబ్బిరెడ్డి, జిఎల్‌ నరసింహులు, కాలేనాయక్‌, జగన్‌, సిపిఐ నాయకులు జగదీష్‌, వేమయ్య, ఇసాక్‌, ఇలియాజ్‌, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు:తీవ్ర కరువుతో రాయలసీమలో గుక్కెడు తాగునీటి కోసం కూడా ప్రజలు అలమటిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ విమర్శించారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోరుతూ వామపక్ష పార్టీల అధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం ఓడి చెరువు మండల కేంద్రానికి చేరుకుంది. వైఎస్సార్‌ సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ గా వెళ్లి, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ లో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఓడిసి మండల కార్యదర్శి రమణ, అమడగూరు మండల కార్యదర్శి నరసింహులు, చాంద్‌బాషా, షబ్బీర్‌, నారాయణ, శ్రీనివాసులు, వెంకటేష్‌, శ్రీరాములు, క్రిష్టప్ప