సిపియం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని ఖండించండి.

సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని  కోరుతున్నాం.

                నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంకోసం, దేశసమగ్రాభివృద్ధికోసం, మతసామరస్యం కోసం పోరాటం చేస్తున్న సిపియం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేయడమంటే దేశంలో మతోన్మాద శక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమౌతుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతసామరస్యం రోజురోజుకి దిగజారుపోతుంది. దేశవ్యాప్తంగా రచయితలు, అభ్యుదయవాదులపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడు చేసి హత్యలకు ప్పాడుతున్నా ప్రధాన మంత్రి స్పందించడంలేదు అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అర్ధమౌతుంది.

                దేశంలో జరుగుతున్న పలు ఘటనలపై సిపియం పార్టీ క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేస్తున్నది. హెచ్‌సియులో విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్య, జెఎన్‌యులో జరిగిన ఘటనపై వామపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి. వీటిని సహించలేని బిజెపి అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపిలు గతంలో రాజస్థాన్‌, ఉత్తరాఖాండ్‌ సిపియం కార్యాలయాలపైన విద్యార్ధిసంఘ నాయకులపైన దాడులు చేశాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం స్పందించకపోవడం వలనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యలైనవారిపై చర్యలు తీసుకోవాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. లేనట్లు అయితే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరిస్తున్నాం.