సిపిఎం నేతలను ముందస్తు అరెస్టు..

ముఖ్యమంత్రి పర్యటనలకొచ్చినప్పుడల్లా సిపిఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రభుత్వ రివాజుగా మారింది. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అరెస్టుల పర్వం కొనసా గింది.సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తిసహా పలువురు సిపిఎం నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయనను ఉన్న పళంగా అరెస్టు చేశారు. ఈ అక్రమాన్ని కుటుంబ సభ్యులు నిలదీసినా పోలీసులు ఆయనను విడిచి పెట్టలేదు. బలవంతంగా జీపు ఎక్కించి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.