సామాజిక భద్రతఏది? :గఫూర్

అసంఘటిర రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో గపూర్‌ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు పెంచిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు.