సర్కార్ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు:మధు

ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థాగత రుణాలను రైతులను ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.