విద్యపై నిర్లక్ష్యం:MLCశర్మ

విజయవాడ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చిన ప్రాథమిక విద్యనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య కోసం అదనంగా రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ( ఎన్‌సిఇఆర్‌టి ) చెప్పినా, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తితో కాకుండా, వ్యాపార దృష్టితో విద్యను అందిస్తోందన్నారు. మహిళలను వ్యక్తిగత ఆస్తిగా చూడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి పరిష్కారాలకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు ముందుగా కుటుంబ జీవితంలో మార్పుతో మొదలవ్వాలని చెప్పారు.