లక్షన్నర ఎకరాలకు సాగునీరు సరఫరా చేయొచ్చు

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రజల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయడంతో పాటు లక్షన్నర ఎకరాలకు సాగునీరు సరఫరా చేయొచ్చని బ్రందం తెలిపింది.