రైల్వే జోన్‌ పై ఎంపి కె. హరిబాబు ప్రకటనపై సిపిఐ(ఎం) నిరసన

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.
    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగరకార్యదర్శి బి. గంగారావు ప్రసంగిచారు. మొన్నటిదాక అదిగోవస్తుంది, యిదిగో వస్తుందని ప్రకటను గుప్పించిన ఎంపి హరిబాబు చావుకబురు చల్లగా చేప్పినట్లు విశాఖకు రైల్వేజోన్‌ రాదని పరోక్షంగా వ్లెడిచారు. రైల్వేజోన్‌ పై వేసిన కమిటి విశాఖకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పటానికి వెనుక ఎంపి కుట్ర ఉంది. రాష్ట్ర విభజనపై వేసిన కమిటి  కూడా విభజన వల్ల నష్టమని తెలిపింది. అయిన రాష్ట్రాన్ని రెండుముక్కులు చేసిన విషయం ఎంపికి తెలియదా? చట్టంలో రైల్వేజోన్‌ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న తరువాత రైల్వేజోన్‌ ప్రకటించకుండా  తీవ్ర జాప్యం చేయడం ఎడల పెద్ద కుట్ర ఉందని  భావిస్తున్నాం. బిజెపి`టిడిపి ఆడుతున్న డ్రామా యిది. వీరి వైఖరి వల్ల ఉత్తరాంధ్రాకి తీవ్ర ద్రోహం జరుగుతుంది.
    బిజెపి శాసనసభా పక్ష సమావేశం విశాఖలో పెట్టి విశాఖకు రైల్వే జోన్‌ రాకుండా కుట్రకు ప్పాడినట్లు అర్ధమవుతున్నది. వీరి అసలు నైజం బయటపడిరది. అమరావతికి రైల్వే జోన్‌ను తన్నుకెళ్ళాలనే దుర్భుద్ది ఉన్నట్లు అర్ధమవుతున్నది. బిజెపి కి విశాఖ నగర ప్రజలు ఓట్లువేసి ఎంపి,ఎంఎల్‌ఎ గా గెలిపించినందుకు తగిన శాస్తి చేస్తున్నారు. విశాఖకు అన్యాయం చేసే చర్యును ప్రతిఘటిస్తాం. అమరావతికి రైల్వేజోన్‌ను తరలించే కుట్రను బిజెపి ` టిడిపి నాయకులు  ఉపసంహరించాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.
    ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యు ఆర్‌.కె.ఎస్‌.వి కుమార్‌, మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి పి. మణి, పార్టీ నగర కమిటీ సభ్యు పి.వెంకటరెడ్డి,  మొదగు కార్యకర్తు పాల్గొన్నారు.