రాజధాని రైతుల సమస్యలపై పోరు

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వ్యాన్ లలో పడేశారు. తమ గొంతు ఎందుకు నొక్కుతున్నారని ప్రశ్నించారు. కళా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులను కూడా పోలీసులు వదలలేదు. వారిని కూడా వ్యాన్ లలో పడేశారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వామపక్ష నేతలు తీవ్రంగా ఎండగట్టారు.