రాజధానిలో సి.పి.ఎం.నేతల‌ అక్రమ అరెస్టుల‌కు నిరసనగా విజయవాడ సి.ఆర్‌.డి.ఏ. కార్యాయం వద్ద ధర్నా

తాత్కాలిక సచివాల‌య నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్ర‌వారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ల‌ను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ  విజ‌య‌వాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లోని సి.ఆర్‌.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల‌ను వెంటనే విడుద చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.    ఎటువంటి నిరసనకు దిగకపోయినా ముందస్తుగానే సిపిఎం నేతల‌ను అరెస్టు చేసి నిర్భందించడం దారుణమన్నారు. తెల్ల‌వారుజామునే బవంతంగా  ఇళ్ళవద్ద అరెస్టు చేయడాన్ని ఆయన ఖండిరచారు.  సింగ్‌పూర్‌, జాపాన్‌ కంపెనీల  పెద్దల‌కు ఈ రాజధానిలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందిగానీ, మన రాష్ట్రంలో వున్న ప్రజకు తిరిగే అవకావం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజానిరసనకు భయపడటం వ‌ల‌నే ప్రభుత్వం అక్రమ అరెస్టుల‌కు ప్పాడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా ఈ విధంగా అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు.   ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడతానుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు.  గతంలో కూడా ముఖ్యమంత్రి  హెలికాఫ్టర్‌ ద్వారా పరిశీన కార్యక్రమం వుంటే క్రింద వున్న ప్రజల‌ను, నాయకుల‌ను అరెస్టు చేయడం విడ్డూరంగా వుందన్నారు.  ప్రజా నిరసన తట్టుకోలేక ప్రభుత్వం  ఈ చర్యల‌కు ప్పాడుతోందన్నారు. ఈ చర్యల‌ను మానుకోకపోతే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసి, నిర్భంధించిన సిపిఎం నాయకుల‌ను వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ  రాజధాని పేరుతో విదేశీ కంపెనీల వ్యాపారం చేయడానికి, వాళ్ళ లాభార్జనకు  ప్రభుత్వం పూనుకుటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టుతో భయపెట్టానుకుంటే ప్రభుత్వ అమాయకత్వమే అవుతుందని హెచ్చరించారు. గత  అనుభవాు తొగుదేశం ప్రభుత్వం గుర్తుంచుకోవాన్నారు. ప్రజ కోసం నిరంతరం సిపిఎం పని చేస్తోందని, ప్రజ అండదండు ఎప్పుడు వుంటాయన్నారు. అందుకే ఈ విధమైన కేసు మానుకోవాని కోరారు.