రాజధానికి15వేలకోట్ల విదేశీరుణం

ఇప్పటికే బ్రిటనతో సహా పలు బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీఎం చంద్రబాబును కలిసి హామీలు ఇస్తున్నందున రుణాల మంజూరుకు పెద్దగా అవరోధాలు ఎదురయ్యే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది. రాజధాని నగర నిర్మాణం కోసం ప్రాథమికంగా రూ.15,000 కోట్ల విదేశీ రుణం అవసరమవుతుందని కమిటీ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, జేబీఎ్‌ససీ, జైకా, బీఎ్‌సఐసీ వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన, కమిషనర్‌ శ్రీకాంతకు పీవీ రమేశ్‌ సూచించారు